BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో MLA గండ్ర సత్యనారాయణ రావు ఇవాళ మాట్లాడారు. మొంథా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.