RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను తీసుకువచ్చింది. దీంతో పౌల్ట్రీ రైతులు CM రేవంత్ రెడ్డిని కలుసుకొని శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వెంకటరావు మాట్లాడుతూ.. రైతుల సమస్యను MLA వీర్లపల్లి శంకర్ CM దృష్టికి తీసుకెళ్లారన్నారు.