కాకినాడ: మొంథా తుఫాను కారణంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో తుఫాను తీవ్రతకు పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొప్పాయి, అరటి, కూరగాయ పంటలు, బంతి తోటల, పత్తి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న పంటలను పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీత బుధవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.