TPT: నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సీఐ బాబి పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ… నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాలలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.