అన్నమయ్య: రాయచోటి పట్టణ జాతీయ రహదారి రింగురోడ్ అభివృద్ధి పనులను బుధవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు మదనపల్లి రోడ్డు పై 7.5 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణం, పీలేరు దాకా డబుల్ లైన్ రోడ్ పనులు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం 120 అడుగుల పరిమితిలోనే రోడ్డు విస్తరణ చేపడతామన్నారు.