RR: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని, ఇనుప విద్యుత్ స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని, గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దన్నారు.