SRD: సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిల్ అయి హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్ రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి బుధవారం తెలిపారు.