GNTR: మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో మంగళగిరి పట్టణానికి త్వరలో 50 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటిని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త బస్సులు మంగళగిరిని సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, గుంటూరు, విజయవాడ వంటి ముఖ్య ప్రాంతాలకు కలుపుతాయి. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల కాలుష్యం తగ్గనుంది.