VZM: మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం రాత్రి వీచిన భారీగాలులకు నెల్లిమర్ల పట్టణం మిమ్స్ సమీపంలో భారీ మర్రిచెట్టు నేలకొరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. చెట్టు కొమ్మలను సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. దీంతో విజయనగరం-పాలకొండ రహదారిలో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.