SKLM: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారిని డా. కె.అనిత అన్నారు. మొంథా తుఫాన్ సందర్భంగా మంగళవారం పోలాకి పీహెచ్సీని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ తర్వాత వచ్చే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు ఉంటే వారిని ఆసుపత్రిలోనే ఉంచాలన్నారు.