ప్రో కబడ్డీ సీజన్ 12లో మరికాసేపట్లో కీలక మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్-3లో భాగంగా తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గెలిచిన జట్టు పుణేరి పల్టాన్స్తో క్వాలిఫయర్-2 ఆడనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దీంతో ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.