KRNL: గూడూరు మండలం పెంచికలపాడులోని పత్తి మిల్లును జిల్లా కలెక్టర్ సిరి సందర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పత్తి నాణ్యత, నిల్వ సదుపాయాలు, యంత్రాల పనితీరు, కార్మికుల భద్రతా చర్యలను పరిశీలించి రైతులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని మిల్లు నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పత్తి మిల్లు యాజమానులు పాల్గొన్నారు.