VSP: తుఫాను నేపథ్యంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పీ. విష్ణుకుమార్ రాజు మంగళవారం ఆర్కే బీచ్ రోడ్డు ప్రాంతాన్ని సందర్శించారు. సముద్ర తీరంలో గాలి, అలల ప్రభావాన్ని పరిశీలించిన అనంతరం, ఆయన ప్రజలు అవసరం లేకుండా బీచ్‌కు రావద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.