GNTR: తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని పునరావాస కేంద్రంలో బస చేస్తున్న 33 కుటుంబాలతో మంగళవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు, గ్రామ నాయకులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఎవరూ భయపడవద్దని తెలిపారు.