PPM: తుఫాను కారణంగా అడారు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎవరు రాకపోకలు చేయవద్దని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. మంగళవారం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ పరిధిలోని దుగ్గేరు సమీపంలో ఉన్న ఆడారు వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో మాట్లాడారు. అనంతరం వాగు వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును కూడా ఆయన పరిశీలన చేశారు.