BPT: సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి గ్రామంలోని ఈదురుగాలు దాటికి వేప చెట్టు పడడంతో స్తంభం విరిగిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ AE దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది వెంటనే నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ పునరుద్ధరించారు.