VZM: మొంథా తుఫాను నేపథ్యంలో తాటిపూడి రిజర్వాయరును జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టం, భద్రతా చర్యలను సమీక్షించారు. అనంతరం గంట్యాడ పోలీస్ స్టేషన్లో తుఫాను సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.