W.G: మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 29 పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం 19 పునరావాస కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని, ఇంకా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే అధికారులు అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండాలన్నారు.