PDPL: గ్రూప్-1 నియామకాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో 509వ ర్యాంకు సాధించిన కరీంనగర్‌కు చెందిన కంకణాకల శ్రీజరెడ్డి, 609వ ర్యాంకు సాధించిన జగిత్యాలకు చెందిన వేముల సుమలత, 446వ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన సాదినేని ప్రియాంకలు ఉన్నారు.