BDK: దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్షించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును మంగళవారం వారు పరిశీలించారు. ఆన్లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని సమీక్షించారు.