AP: ‘మొంథా’ తుఫాన్ వేగంగా రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. ఇవాళ రాత్రి 11:30 గంటల తర్వాత కోనసీమ జిల్లాలోని రాజోలు-అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో భారీగా ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. దీంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న షాపులన్నింటినీ మూసివేయించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ సూచనలను అనుసరించాలని పేర్కొన్నారు.