TPT: శ్రీకాళహస్తి మండల పరిధిలోని ముళ్ళపూడి, దొమ్మరపాలెం గ్రామాలలో మంగళవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించారు. గ్రామాల్లోని వాగులను వంకలను పరిశీలించారు. తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.