VZM: కొత్తవలస రైల్వే స్టేషన్ ప్రవేశ మార్గం వర్షంనీటిలో మునిగిపోయింది. దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి నానా అవస్థలు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఈదుస్థితి ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చిన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.