BHNG: భువనగిరిలో ట్రాఫిక్ పోలీసులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జూనియర్ కాలేజీ నుంచి వినాయకనగర్ చౌరస్తా మీదుగా ప్రిన్స్ కార్నర్ వరకు ఆటో యూనియన్ సభ్యులైన ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ ప్రభాకరెడ్డి, భువనగిరి ట్రాఫిక్ పీఎస్ ఎస్ట్రెచ్ మధుసూధన్, ఎస్సై ప్రవీణ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.