ASF: అంగవైకల్యం నిర్ధారణ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న UDID కేంద్రాన్ని సందర్శించి గదులు, ఏర్పాట్లను పరిశీలించారు. అంగవైకల్యం కలిగి పింఛను పునరుద్ధరణ కోసం, నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు.