ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం తుఫాన్ సహాయక చర్యలపై గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ వినూత్న అధికారులతో సమీక్షించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గర్భిణీలను దగ్గరలోని పీహెచ్సీలకు తరలించామన్నారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులని ఆదుకుంటామన్నారు.