KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో మంగళవారం పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో గాలికుంటూ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 256 పశువులకు టీకాలు వేశారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించారు. పశువుల ఆరోగ్య రక్షణకు ఈ చర్యలు ఉపయోగపడతాయని డాక్టర్ మాధవరావు తెలిపారు.