AP: మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. అంతర్వేది సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటడానికి 3-4 గంటల సమయం పట్టనుంది. గంటకు 17 కి.మీ వేగంతో కదులుతుంది. తీరం వెంబడి 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మచిలీపట్నానికి 20 కి.మీ, కాకినాడకు 110 కి.మీ, విశాఖకు 220 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.