SRCL: ఉద్యోగికి చేసిన సేవలే గుర్తింపుని ఇస్తాయని బోయినపల్లి ఎస్సై రమాకాంత్ అన్నారు. పోలీస్ స్టేషన్లో ఏఎస్సై మల్లేష్ కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీ కాగా మంగళవారం శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రమాకాంత్ మాట్లాడుతూ… ASI మల్లేష్ అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారని, ఆయన అందించిన సేవలు, సహకారం మరువలేనివని అన్నారు.