TPT: తిరుమలలో సన్నిధి గొల్ల శరభయ్య యాదవ్ విగ్రహంతోపాటు మఠం ఏర్పాటు చేయాలని ఏపీ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశ అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవో, సభ్యులను కలసి వినతి అందజేశారు. ఇంతవరకు శరభయ్య విగ్రహం ఏర్పాటు చేయకపోవడం దారుణమని, ఇకనైనా ప్రభుత్వం చొరవతో యాదవుల కోర్కెలను తీర్చాలని ఆయన కోరారు.