JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ మోడల్ స్కూల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం, వాటి ప్రభావాలను గురించి అవగాహన కల్పించారు. ఎసీడీపీవో అరవింద, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ అశోక్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన మాదకద్రవ్యాల వినియోగం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, అపరిచితులు ఇచ్చే వాటిని తినకూడదన్నారు.