ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.