BDK: జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రాబోయే 2 రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.