ప్రకాశం: కంభం మండలం సూరేపల్లి గ్రామంలో నల్లవాగు వద్ద మంగళవారం పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. వాగులో నీటి మట్టం పెరగడంతో ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు పహారా ఏర్పాటు చేసి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామస్థుల భద్రత కోసం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరసింహారావు, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.