JGL: కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని వెల్గటూర్ మండల వైద్యాధికారి డాక్టర్ తేజశ్రీ సూచించారు. వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. తేజశ్రీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.