కృష్ణా: నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని డీఎస్పీ ధీరజ్ వినీల్ సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలను డీఎస్పీ ఆరా తీశారు. తుఫాను తీరం దాటే వరకు కేంద్రాల్లోనే ఉండాలని, పోలీసు శాఖకు సహకరించాలని, ప్రజలు ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని ఆయన సూచించారు.