CTR: వర్షాల కారణంగా ఇబ్బందులు పడే ప్రజలకు సత్వరమే సాయం అందించాలని MLA జగన్ మోహన్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో MLA కార్యాలయ సిబ్బంది, TDP నాయకులు వేగంగా స్పందిస్తున్నారు. వర్షాల కారణంగా ఇవాళ చిత్తూరు నగరపాలక పరిధిలో 27వ వార్డు చామంతిపురం, వినాయకపురంలో 2 ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ మేరకు MLA తండ్రి చెన్నకేశవుల నాయుడు వారికి నిత్యవసర సరుకులు అందించారు.