అన్నమయ్య: మొంథా తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలో గుంటి మడుగును ఎమ్మార్వో నరసింహ కుమార్ పరిశీలించారు. తుఫాను ప్రభావం ఎక్కువ అవుతుండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రాయచోటి గుంటిమడుగులో లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరించి పక్కనే ఉన్న పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన నిత్యావసర సామాగ్రి, దుప్పట్లు, అందజేశారు.