కృష్ణా: ‘మోంథా’ తుఫాను ప్రభావంతో దివిసీమలో ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. అవనిగడ్డ–నాగాయలంక ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగి రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చెట్టు కారణంగా కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగించాయి. సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్సై సిబ్బందితో కలిసి ఘటనాస్థలనికి చేరుకుని చెట్టును పక్కకు తరలించారు.