CTR: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు 17 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు. చిత్తూరులో చేపట్టిన వాహనాల తనిఖీల్లో 17 మంది మద్యం సేవించి నడుపుతుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.1.70 లక్షల జరిమానా విధించారని పేర్కొన్నారు.