ELR: జిల్లాలోన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. కైకలూరు సమీపంలో మాదేపల్లి గ్రామంలో పంట పొలాల వద్ద రైతులతో మాట్లాడారు. కొల్లేరు సమీపంలో చెరువుల వద్ద ఆక్వా రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కైకలూరు నుంచి ఉప్పుటేరు బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎంపీ ఉప్పుటేరు నీటి ఉధృతిని పరిశీలించారు.