GNTR: మేడికొండూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం రాత్రి పర్యటించారు. మొంథా తుఫాను దృష్ట్యా మండలంలో పేరేచర్ల, మేడికొండూరు, సిరిపురం, పాలడుగు గ్రామాల్లో పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులు పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.