NLG: అన్యాక్రాంతమైన చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాధస్వామి దేవాలయ భూములను రెవిన్యూ, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి కాపాడాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. సుమారు 6 ఎకరాల భూమిని ఆక్రమించుకొని ప్రైవేటు వెంచర్ వారు దారి వేశారని తెలిపారు.