NLG: క్రమశిక్షణ గల యువత రాజకీయాల్లో రాణించినప్పడే నీతి, నిజాయితీ గల నాయకులు ఉంటారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాలలో మంగళవారం జరిగిన యంగ్ కమ్యూనిస్టు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో విఫలం అయ్యాయని విమర్శించారు. యువ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.