PDPL: పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టర్ చాంబర్లో విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఆవిష్కరించారు. ఆయన ఉద్యోగులు, అధికారులు తమ విధి జాగ్రత్తగా,బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అవినీతి, అక్రమాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంగా ఉండాలని పేర్కొన్నారు.