BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో నియోజకవర్గ ప్రజల కోసం అక్టోబరు 30, 2025 గురువారం రోజున గండుగులపల్లి లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు.