ప్రకాశం: కనిగిరి మండలం చల్లగిరగల సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టింది. బోల్తా కొట్టిన లారీ రోడ్డు పక్కన ఉంది. వర్షం గాలుల కారణంగా మంగళవారం రాత్రి అదుపుతప్పి లారీ బోల్తా కొట్టినట్టు సమాచారం. లారీ బోల్తా కొట్టిన సంఘటనకు గల కారణాలు ఏమిటనేది, లారీలో ఉన్నవారికి ఏమైనా ప్రమాదం జరిగిందా అనే సమాచారం తెలియాల్సి ఉంది.