WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి జిల్లా రైతులు డిమాండ్ చేశారు.