AP: శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పాతాళగంగ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దీంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం తప్పింది. మొంథా తుఫాన్ నేపథ్యంలో శ్రీశైలం వచ్చే భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.