SRD: పటాన్ చెరులోని బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి బాలికలు కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం వసతి గృహంలోని డైనింగ్ హాల్ కిచెన్ పరిశీలించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.